LIVE
తిరువూరులో రాజకీయ వివాదాలకు ఇకపై పుల్‌స్టాప్: ఎమ్మెల్యే కొలికిపూడి
వెనక్కి

తిరువూరులో రాజకీయ వివాదాలకు ఇకపై పుల్‌స్టాప్: ఎమ్మెల్యే కొలికిపూడి

44 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

గత కొన్ని రోజులుగా తిరువూరు కేంద్రంగా జరుగుతున్న రాజకీయ వివాదాలకు పుల్ స్టాప్ పెడుతున్నట్టు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ తెలిపారు. ఎంపీ కేశినేని చిన్నికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తానని.. అటు వైపు నుంచి కూడా అదే రకమైన గౌరవాన్ని ఆశిస్తున్నానని చెప్పారు. తమ ఇద్దరి చుట్టూ ఉన్న కొంత మంది వ్యక్తుల వల్ల వివాదం మరింత ముదిరిందని అభిప్రాయ పడ్డారు. ఏపీ టీడీపీ అధ్యక్షునితో మాట్లాడాక కొలికిపూడి శ్రీనివాస్ స్వరంలో కాస్త మార్పు రావటం గమనార్హం.

షేర్ చేయండి:
6 మార్చి, 2026 04:13 PMకి